Engineering Seats Counseling In Telangana From Tomorrow : ఇంజినీరింగ్ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్న విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ తీపి కబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ సీట్లు ఖరారు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో 137 ప్రైవేటు కాలేజీల్లో 80,091 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయని వెల్లడించింది. 16 యూనివర్సిటీ కాలేజీల్లో 4,713 ఇంజినీరింగ్ సీట్లు ఖాళీ ఉన్నాయని తెలిపింది. రెండు ప్రైవేటు వర్సిటీల్లో 1,302 సీట్లు ఉన్నాయని.. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 62,079 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. సీఎస్ఈ, ఇతర ఐటీ కోర్సుల్లోనే 45,885 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. సుమారు మరో పదివేల సీట్లు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. రేపటి నుంచి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ.. జేఎన్టీయూహెచ్, ఓయూ, కేయూ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశాయి.
Telangana Engineering Seats : ఈసారి ఇంజినీరింగ్ సీట్లు ఎన్నంటే..? - 2023 తెలంగాణ ఇంజినీరింగ్ సీట్లు
17:45 June 27
Telangana Engineering Seats : ఇంజినీరింగ్ సీట్లు ఖరారు చేసిన రాష్ట్ర విద్యాశాఖ.. రేపటి నుంచే వెబ్ ఆప్షన్లు
TS Engineering Counselling Schedule 2023 : ఈ ఏడాది వివిధ కాలేజీల్లో అత్యధికంగా సీఎస్ఈలో 16,617.. ఈసీఈలో 10,394 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీఎస్ఈలో ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్, మెషీన్ లెర్నింగ్ కోర్సులో 8,154.. డేటా సైన్స్‌లో 4,635, సైబర్ సెక్యూరిటీలో 1,404, ఐఓటీలో 588 సీట్లు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 3,936, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సులో 1,554 సీట్లు ఉన్నాయి. ట్రిపుల్ ఈలో 4,454, సివిల్‌లో 3,567, మెకానికల్ లో 3,147 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 10 శాతం సీట్లు కేటాయించనున్నారు.
Telangana Engineering Seats 2023 : కొత్తగా కోర్సులు రాకపోయినప్పటికీ.. డిమాండ్ ఉన్న కోర్సుల్లో కొన్ని పెరిగాయి. గత రెండేళ్లుగా పలు కాలేజీలు మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సంప్రదాయ కోర్సుల్లో సీట్లను వెనక్కి ఇచ్చి.. కంప్యూటర్ సంబంధిత కోర్సులను ప్రవేశ పెడుతున్నాయి. ఈ ఏడాది పలు కాలేజీలు సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ వంటి కోర్సుల్లో సుమారు పదివేల సీట్లను తగ్గించుకొని.. వాటి స్థానంలో సీఎస్‌ఈ, ఏఐఎంఎల్, డేటా సైన్స్ వంటి కోర్సులకు అనుమతి కోరాయి. ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ సీట్లు కూడా త్వరలో అందుబాటులోకి రావచ్చునని భావిస్తున్నారు. ఎన్‌బీఏ అనుమతి ఉన్న కాలేజీలు మరో 4 వేల అదనపు సీట్లకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిపై కూడా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రేపటి నుంచి ఆగస్టు 8 వరకు వెబ్ ఆప్షన్ల గడువు ఉంది.
ఇవీ చదవండి :