తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Engineering Jobs 2023 : ఐటీఐ, డిప్లొమా అర్హతతో.. 1191 అప్రెంటీస్​ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా! - లేటెస్ట్ జాబ్​ న్యూస్​ 2023

Engineering Jobs 2023 : ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ చేసి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. వెస్ట్రన్​ కోల్​ఫీల్డ్స్​ లిమిటెడ్​ 1191 అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..

Western Coalfields Ltd Recruitment 2023 for 1191 Apprentice Posts
Engineering Jobs 2023

By

Published : Aug 14, 2023, 10:44 AM IST

Engineering Jobs 2023 : వెస్ట్రన్​ కోల్​ఫీల్డ్స్​ లిమిటెడ్ 1191 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ (Western Coalfields Ltd Recruitment 2023) ఉద్యోగాల కోసం ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు
Apprentice Jobs 2023 :

  • ట్రేడ్​ అప్రెంటీస్​ - 875 పోస్టులు
  • టెక్నీషియన్ అప్రెంటీస్​ - 101 పోస్టులు
  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​ - 215 పోస్టులు

విద్యార్హతలు
Trade Apprentice Jobs Qualification :

  • ట్రేడ్​ అప్రెంటీస్: ఐటీఐ (సంబంధిత ట్రేడ్​ విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి)
  • టెక్నీషియన్ అప్రెంటీస్: ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థలో (సంబంధిత విభాగాన్ని అనుసరించి) డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​ : ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థలో (సంబంధిత విభాగాన్ని అనుసరించి) బీటెక్​ లేదా బీఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
Apprentice Jobs Age Limit : 2023 సెప్టెంబర్​ 16 నాటికి అభ్యర్థుల వయస్సు 18 - 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం
Western Coalfields Ltd Apprentice Selection Process :సెలక్షన్​ ప్రాసెస్ మొత్తం మూడు దశల్లో ఉంటుంది. మొదటిగా అభ్యర్థుల మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్​ను తయారు చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్​ ఉంటుంది. ఆ తరువాత అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులను అప్రెంటీస్​ పోస్టులకు ఎంపిక చేస్తారు.

అప్రెంటీస్​ స్టైపెండ్​
Western Coalfields Ltd Apprentice Stipend :

పోస్టు స్టైపెండ్​ (నెలవారీగా)
ట్రేడ్ అప్రెంటీస్​ (ఫ్రెషర్​) రూ.6,000
ట్రేడ్ అప్రెంటీస్​ (ITI మొదటి సంవత్సరం) రూ.7,700
ట్రేడ్ అప్రెంటీస్​ (ITI రెండో సంవత్సరం) రూ.8,050
టెక్నీషియన్​ అప్రెంటీస్​ రూ.8,000
గ్రాడ్యుయేట్​ అప్రెంటీస్ రూ.9,000

దరఖాస్తు విధానం
Western Coalfields Ltd Apprentice Jobs Online Apply :

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్​సైట్​ www.westerncoal.in ను ఓపెన్ చేయాలి.
  • తరువాత దరఖాస్తు చేయడం​ కోసం మీ ఈ-మెయిల్ ఐటీ, మొబైల్​ నంబర్​తో రిజిస్టర్​ ఐడీ క్రియేట్​ చేసుకోవాలి.
  • అప్లికేషన్​ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • మీ ఫొటో, సంతకాలను స్కాన్ చేసి, Jpeg ఫార్మాట్​లో అప్​లోడ్ చేయాలి.
  • దరఖాస్తును మరోసారి పూర్తిగా సరిచూసుకొని, సబ్​మిట్​ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
Western Coalfields Apprentice Important Dates :

  • ఆన్​లైన్​ అప్లికేషన్​ స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్​ 1
  • ఆన్​లైన్​ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్​ 16

ABOUT THE AUTHOR

...view details