తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Engineering Jobs 2023 : ఐటీఐ, ఇంజినీరింగ్ అర్హతతో.. 531 నాన్​-ఎగ్జిక్యూటివ్​ ఉద్యోగాలు! - ఎండీఎల్ నాన్​ ఎగ్జిక్యూటివ్​​ జాబ్స్ 2023

Engineering Jobs 2023 In Telugu : ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్​, పీజీ చదివి.. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు శుభవార్త. మజగావ్​​ డాక్​ షిప్​ బిల్డర్స్ లిమిటెడ్​ 531 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హత, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..

MDL Recruitment 2023
Engineering Jobs 2023

By

Published : Aug 15, 2023, 10:38 AM IST

Engineering Jobs 2023 : ఇంజినీరింగ్​, ఐటీఐ, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్​ చేసి.. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. మజగావ్​ డాక్ షిప్​ బిల్డర్స్​ లిమిటెడ్​ 351 నాన్​-ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో (MDL Recruitment 2023) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాలు-వివరాలు
MDL Non Executive Jobs :

  • Skilled-I (ID-V) : ఏసీ రిఫ్రిజిరేటర్​ మెకానిక్​, కార్పెంటర్​, చిప్పర్​ గ్రైండర్​, కాంపోజిట్​ వెల్డర్​, కంప్రెసెర్​​ అటెండెంట్​, డీజిల్​ కమ్ మోటార్​ మెకానిక్​, డ్రైవర్​, ఎలక్ట్రిక్​ క్రేన్ అపరేటర్​, ఎలక్ట్రీషియన్​, ఎలక్ట్రానిక్​ మెకానిక్​, ఫిట్టర్​, గ్యాస్​ కట్టర్​, హిందీ ట్రాన్స్​ లేటర్​, జూనియర్​ డ్రాట్స్​మెన్ (ఎలక్ట్రికల్​/ సివిల్​/ మెకానికల్​), జూనియర్​ క్వాలిటీ కంట్రోల్​ ఇన్​స్పెక్టర్​ (మెకానికల్​/ఎన్​డీటీ), మిల్​రైట్​ మెకానిక్​, పెయింటర్​, పారామెడిక్​, పైప్​ ఫిట్టర్​, ప్లానర్​ ఎస్టిమేటర్​ (మెకానిక్​/సివిల్​), రిగ్గర్​, స్టోర్​ కీపర్​, స్ట్రక్చురల్ ఫాబ్రికేటర్​, యుటిలిటీ హ్యాండ్​ (స్కిల్డ్​)
  • Semi-Skilled-I (ID-II) :ఫైర్​ ఫైటర్స్​, సెయిల్​ మేకర్​, సెక్యూరిటీ సిపాయి, యుటిలిటీ హ్యాండ్​ (సెమీ-స్కిల్డ్​)
  • Special Grade (ID-VIII) : లాంఛ్​ ఇంజిన్​ క్రూ/ మాస్టర్​ 2ed క్లాస్​
  • Special Grade (ID-IX) :మాస్టర్​ 1st క్లాస్​

విద్యార్హతలు
MDL Non Executive Jobs Eligibility :అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి (సంబంధిత విభాగాలను అనుసరించి) 10వ తరగతి/ ఐటీఐ/ డిప్లొమా/ పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. (MDL Non Executive Recruitment 2023)

వయోపరిమితి
MDL Non Executive Age Limit : 2023 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18-38 ఏళ్లు మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం
MDL Non Executive Selection Process : అభ్యర్థులకు ఆన్​లైన్ పరీక్ష నిర్వహిస్తారు. తరువాత ట్రేడ్​ టెస్ట్/ స్కిల్​ టెస్ట్​ చేస్తారు. తరువాత మెడికల్​ టెస్ట్​ కూడా నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. అయితే ఆయా రంగాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

జీతభత్యాలు
MDL Non Executive Salary :

గ్రేడ్​ పే స్కేల్​
స్పెషల్​ గ్రేడ్​ (IDA-IX) రూ.22,000 - రూ.83,180
స్పెషల్​ గ్రేడ్​ (IDA-VIII) రూ.21,000 - రూ.79,380
స్కిల్డ్​ గ్రేడ్​ (IDA-V) రూ.17,000 - రూ.64,360
సెమీ స్కిల్డ్​ గ్రేడ్​ (IDA-II) రూ.13,200 - రూ.49,910

దరఖాస్తు విధానం
MDL Non Executive Online Apply :

  • అభ్యర్థులు www.mazagaondock.in వెబ్​సైట్​ ఓపెన్ చేయాలి.
  • MDL అప్లై ఆన్​లైన్ లింక్​ను క్లిక్ చేసి, ఓపెన్​ చేయాలి.
  • ముందుగా మీ యూజర్​ నేమ్, పాస్​వర్డ్​ క్రియేట్​ చేసుకోవాలి.
  • దరఖాస్తులో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • ముఖ్యమైన డాక్యుమెంట్లను అప్​లోడ్ చేయాలి.
  • వివరాలు అన్నీ మరోసారి చెక్​ చేసుకొని అప్లికేషన్​ సబ్​మిట్​ చేయాలి.
  • భవిష్యత్​ అవసరాల కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్ భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
MDL Non Executive Notification Important Dates :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ :2023 ఆగస్టు 12
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 21

నోట్​ : పరీక్ష తేదీ, అడ్మిట్​కార్డ్​ అందించే తేదీలను తరువాత తెలియజేస్తారు.

ABOUT THE AUTHOR

...view details