కర్ణాటక మైసూర్లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువకుడి కుబుంబ సభ్యులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన అతడి అవయవాలను వైద్యుల సూచన మేరకు దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఫలితంగా మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు.
ఇదీ జరిగింది..
ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చందన్ అనే యువ ఇంజినీర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మైసూర్‌లోని అపోలో బీజీఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు రోజులపాటు ఐసీయూలో కృత్రిమ శ్వాసపై ఉన్న చందన్ బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చనిపోయినా ఇతరుల్లో తిరిగి జీవించవచ్చని తెలిపిన వైద్యులు.. చందన్ కుటుంబ సభ్యులకు అవయవదానం ప్రాముఖ్యతను వివరించారు. కుటుంబ సభ్యులు అంగీకరించిన నేపథ్యంలో గుండె, మూత్రపిండాలు, కాలేయం సేకరించిన వైద్యులు.. నలుగురికి అమర్చారు.
ఇదీ చదవండి:కథ సుఖాంతం.. కన్నతల్లి చెంతకు గీత