భాజపా, కాంగ్రెస్ నేతల ఆత్మీయ కలయికకు వేదికగా నిలిచింది కర్ణాటకలోని ఓ నవజంట నిశ్చితార్థ వేడుక. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూతురు ఐశ్వర్యతో.. భాజపా నేత ఎస్ఎమ్ కృష్ణ మనవడు ఆమర్త్య హెగ్డే ఎంగేజ్మెంట్ జరిగింది. కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ వ్యవస్థాపకుడు, దివంగత వీజీ సిద్ధార్థ కొడుకే ఈ ఆమర్త్య హెగ్డే.
ఘనంగా డీకే శివకుమార్ కూతురి నిశ్చితార్థం - aishwarya amartya hegde engagement
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూతురితో భాజపా నేత ఎస్ఎమ్ కృష్ణ మనవడి నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇరు పార్టీల నేతలు సందడి చేశారు.
అంగరంగ వైభవంగా 'కాఫీ డే' సిద్ధార్థ కుమారుడి నిశ్చితార్థం
అతిరథుల సమక్షంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి యడియూరప్ప సహా ఇతర రాజకీయ ప్రముఖుల విచ్చేసి, కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. వేడుకల్లో భాజపా, కాంగ్రెస్ శ్రేణులు సందడి చేశాయి.