భారత్‌లో బ్రిడ్జ్ ట్రయల్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తాజాగా వెల్లడించిన నేపథ్యంలో ఫైజర్ సంస్థ స్పందించింది. భారత్‌లో తమ టీకా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉన్నట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో ఒప్పందం కుదిరిన తరువాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
Pfizer: 'కేంద్రంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాం'
భారత్‌లోకి ఫైజర్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చే విషయంపై కేంద్రంతో సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. చర్చలు పూర్తైన తర్వాత మరిన్ని వివరాలు ప్రకటిస్తామని ఫైజర్ సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు.
ఫైజర్
ఇప్పటికే పలు విదేశీ నియంత్రణ సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన టీకాలు దేశంలోకి వచ్చేందుకు మార్గం సుగమం చేసేలా నిర్దిష్ట మినహాయింపులు ఇచ్చింది డీసీజీఐ. ఈ టీకాలు భారత్‌లో అనుమతుల కోసం బ్రిడ్జ్ ట్రయల్స్‌ను నిర్వహించాల్సిన అవసరం లేదని డీసీజీఐ చీఫ్ వి.జి.సొమని తెలిపారు.
ఇదీ చూడండి:Corona Vaccine: విదేశీ టీకాల రాకకు లైన్‌క్లియర్..!