తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా కట్టడిలో టీకాయే శక్తిమంతమైన ఆయుధం' - ప్రధాని నరేంద్ర మోదీ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో భేటీ

దేశంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతన్న నేపథ్యంలో ప్రధాని మోదీ.. ప్రముఖ వైద్యులు, ఫార్మా సంస్థల ప్రతినిధులతో సోమవారం సమావేశమయ్యారు. కొవిడ్​ కట్టడిలో టీకాయే శక్తిమంతమైన ఆయుధమన్న మోదీ.. వ్యాక్సినేషన్​లో ప్రతిఒక్కరినీ భాగస్వాముల్ని చేయాలని వైద్యులను కోరారు.

PM Narendra Modi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

By

Published : Apr 19, 2021, 11:02 PM IST

దేశంలో అందరూ కొవిడ్ టీకా తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ వైద్యులను కోరారు. రెండో దశ కరోనా ఉద్ధృతి నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులతో వర్చువల్‌గా సమావేశమైన మోదీ.. వ్యాక్సినేషన్‌పై వస్తున్న వదంతుల నుంచి ప్రజలను చైతన్య పరచాలని కోరారు.

కరోనా మహమ్మారి కట్టడికి టీకా శక్తివంతమైన ఆయుధమన్న మోదీ.. ఎక్కువ మంది టీకా తీసుకునేలా ప్రోత్సహించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం.. టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో కొవిడ్​ వేగంగా వ్యాపిస్తోందన్న ప్రధాని.. వైరస్​ కట్టడి విధానాలను కచ్చితంగా అమలుచేసేలా అక్కడున్న వారి సహోద్యోగులకు ఆన్‌లైన్ ద్వారా సలహాలు ఇవ్వాలని సూచించారు. అత్యవసరం కానీ ఇతర వ్యాధుల చికిత్సకు టెలీ మెడిసిన్ విధానాన్ని ప్రోత్సహించాలని వైద్యుల సమావేశంలో పేర్కొన్నారు మోదీ.

ఇదీ చదవండి:'రెమిడె​సివిర్​ను బ్లాక్​లో అమ్మితే కఠిన చర్యలే'

ఫార్మా సంస్థలతో మోదీ భేటీ

దేశంలోని ప్రముఖ ఫార్మా సంస్థల ప్రతినిధులతో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనా కట్టడి కోసం.. ఫార్మ సంస్థల సహకారం కోరిన ఆయన.. ఔషధాల ఉత్పత్తి, సరఫరా, టీకాలు వంటి కీలక విషయాలపై చర్చించారు. ఈ మేరకు కొత్త ఔషధాల తయారీ, నియంత్రణ ప్రక్రియల సంస్కరణల కోసం ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మందులు, అవసరమైన వైద్య పరికరాల సరఫరా సజావుగా సాగించాలన్న ఆయన.. ఇందుకోసం లాజిస్టిక్స్​, రవాణా వంటి సౌకర్యాలకు ప్రభుత్వ మద్దతును విస్తరించారు.

కరోనాతో పాటు భవిష్యత్తులో సంభవించే మరిన్ని ప్రాణాంతక వ్యాధులపై వీలైనన్ని ఎక్కువ పరిశోధనలు నిర్వహించాలని ఈ భేటీలో కోరారు మోదీ. తదనుగుణంగా వైరస్​లను ముందుగానే పసిగట్టి, ఎదుర్కొనేందుకు వీలుంటుందన్నారు.

ఇదీ చదవండి:'మోదీ ప్రభుత్వానికి వారిపై కృతజ్ఞత లేదు'

ABOUT THE AUTHOR

...view details