జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాల చేతుల్లో సోమవారం ఓ ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్ జిల్లా రావల్పోరాలో భద్రతా సిబ్బందికి, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదిని మట్టుబెట్టారు. చనిపోయిన ఉగ్రవాదిని లష్కర్-ఏ-తోయిబాకు చెందిన షాజిద్ అఫ్ఘానీగా అధికారులు గుర్తించారు.
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్- ఉగ్రవాది హతం - జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్- ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో రావల్‌పొరాలో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. భద్రతా బలగాలు, ముష్కరులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్- ఉగ్రవాది హతం
రావల్పోరాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో మార్చి 13న సాయంత్రం నుంచి నిర్బంధ తనిఖీలు ప్రారంభించాయి బలగాలు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీటుగా ఎదుర్కొన్న భద్రతా సిబ్బంది.. ఆదివారం ఒక ముష్కరుడ్ని, సోమవారం మరో ముష్కరుడిని మట్టుబెట్టాయి. కాల్పులు కొనసాగుతున్నట్లు చెప్పారు.
Last Updated : Mar 15, 2021, 1:11 PM IST