కశ్మీర్లో ఎన్‌కౌంటర్- ముగ్గురు ఉగ్రవాదులు హతం - undefined
17:10 January 29
జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది సైన్యం.
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.
త్రాల్ ప్రాంతంలోని మందూరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని సైన్యం తెలిపింది. వెంటనే స్పందించిన జవాన్లు ఎదురుకాల్పులు జరపగా.. ముగ్గురు ముష్కరులు హతమయ్యారని వెల్లడించింది.
ఇదీ చదవండి:ప్రియురాలి ఇంటి నుంచి.. పాకిస్థాన్‌లోకి.!