జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్- ఉగ్రవాది హతం - జమ్ములో ముష్కర వేట
ఎన్కౌంటర్
17:40 July 26
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
జిల్లాలోని అహర్బాల్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్టు సమాచారంతో భద్రత సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రత బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడు హతమైనట్లు అధికారులు తెలిపారు.
Last Updated : Jul 26, 2021, 6:05 PM IST