తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​లో ఈ ఏడాది 100 మంది ఉగ్రవాదులు హతం' - జమ్ము కశ్మీర్ ఎన్​కౌంటర్ వార్తలు

జమ్ము కశ్మీర్​లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. దీంతో ఈ ఏడాది మరణించిన ఉగ్రవాదుల సంఖ్య 100 దాటింది.

encounter in jammu and kashmir
కశ్మీర్ ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

By

Published : Aug 24, 2021, 3:03 PM IST

Updated : Aug 24, 2021, 4:13 PM IST

జమ్ము కశ్మీర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని పెథ్​సీర్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఎన్​కౌంటర్ ప్రారంభం కాగా.. మంగళవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్.. ఎన్​కౌంటర్​కు దారితీసిందని అధికారులు తెలిపారు.

మంగళవారం ఉదయం బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ప్రతిదాడుల్లో ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టామని వెల్లడించారు. మృతులు ఏ సంస్థకు చెందినవారనే వివరాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు.

కాగా, తాజా ఎన్​కౌంటర్​తో ఈ ఏడాది మరణించిన ఉగ్రవాదుల సంఖ్య 100 దాటిందని కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.

ఉగ్ర స్థావరం గుట్టు రట్టు

స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలతో బలగాలు

మరోవైపు, బందిపొరా, నాగ్​మార్గ్​ అటవీ ప్రాంతంలోని ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ధ్వంసం చేసింది భారత ఆర్మీకి చెందిన అసోం రైఫిల్స్. భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఇందులో 10 యూబీజీఎల్ గ్రెనేడ్లు, రెండు చైనా గ్రెనేడ్​లు ఉన్నట్లు తెలిపింది.

గ్రెనేడ్లు
పేలుడు పదార్థాలు

ఇదీ చదవండి:అఫ్గాన్​ కోసం భారత్​ 'ఆపరేషన్ దేవీ శక్తి'

Last Updated : Aug 24, 2021, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details