Jammu Kashmir Encounter: కశ్మీర్లో ఉగ్రవాదులు- భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని జవాన్లు మట్టుపెట్టారు. అనంతనాగ్‌లోని శ్రీగుఫ్వారా ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. మృతిచెందిన ఉగ్రవాదిని ఫహీమ్ భట్‌గా అధికారులు గుర్తించారు. అతను ఖాదీపుర ప్రాంతంలో నివాసం ఉండేవాడని పోలీసులు తెలిపారు.
Kashmir Encounter: కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం - Anantnag
Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఎన్కౌంటర్
ఫహీమ్ ఇటీవలే ఇస్లామిక్ స్టేట్ జమ్ముకశ్మీర్‌లో చేరినట్లు అధికారులు తెలిపారు. అంతేగాకుండా బిజ్‌బెహరా పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఏఎస్ఐ మహ్మద్ అష్రాఫ్ హత్యలో కూడా అతడి హస్తం ఉన్నట్టు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ప్రియుడితో కలిసి భర్తను చంపి.. మృతదేహాన్ని డ్రమ్ములో దాచి..