తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ఉగ్రవాదులు హతం - ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​లో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.

Encounter in JK
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​

By

Published : May 4, 2021, 6:53 PM IST

Updated : May 4, 2021, 10:49 PM IST

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఇద్దరు లష్కరే తొయిబా ముష్కరులు హతమయ్యారు.

సోపోర్ ప్రాంతంలోని నాతిపొరాలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు.

భద్రతా బలగాల వాహనాలు
తనిఖీలు నిర్వహిస్తున్న బలగాలు
భద్రతా సిబ్బంది వాహనం

భద్రతా దళాలు మట్టుబెట్టిన వారిలో ఓ విదేశీ ముష్కరుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో అతడు ఇద్దరు కౌన్సిలర్లు, ఓ పోలీసును చంపాడని సైన్యాధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:సెక్యూరిటీ తెగువ.. చోరీకి వచ్చిన దుండగులు పరార్

Last Updated : May 4, 2021, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details