జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్ ప్రాంతంలో నక్కి ఉన్న ముగ్గురు ముష్కరులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. వారి నుంచి మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హతమైన వారిలో ఒకరిని గందర్‌బల్‌కు చెందిన ముక్తార్ షాగా గుర్తించారు. బిహార్‌కు చెందిన వీరేంద్ర పాశవాన్ అనే వ్యక్తిని చంపిన తరువాత వీరు షోపియాన్‌కు మకాం మార్చినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.