పోలీసుల కాల్పుల్లో నలుగురు నక్సల్స్ హతం - encounter
17:47 March 16
పోలీసుల కాల్పుల్లో నలుగురు నక్సల్స్ హతం
బిహార్‌లో పోలీసులకు, నక్సల్స్‌కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. గయా జిల్లాలోని మనుబార్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలిలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కోబ్రా 205వ బెటాలియన్, సీఆర్పీఎఫ్, బిహార్ పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. మృతులను అమ్రేష్ సింగ్ భోక్తా, శివపూజన్ యాదవ్, సీతా భుయ్యాన్, ఉదయ్ పాశ్వాన్‌గా అధికారులు గుర్తించారు. మూడు ఏకే-47 తుపాకులు, ఐఎన్ఎస్ఏఎస్ రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
TAGGED:
encounter