జమ్ముకశ్మీర్లో భద్రతా సిబ్బంది కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్ జిల్లా కానిగం ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టింది భారత సైన్యం. ముందే పసిగట్టిన ముష్కర ముఠా.. వారిపై కాల్పులు జరిపింది. దీటుగా తిప్పికొట్టిన భద్రతా బలగాలు ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కశ్మీర్లో ఎన్కౌంటర్- ముష్కరుడు హతం - DDC POLLS
జమ్ముకశ్మీర్ షోపియాన్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి.
కశ్మీర్లో ఎన్కౌంటర్- ముష్కరుడు హతం
ముష్కరుల కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: కశ్మీర్ ఎన్నికల ప్రక్రియలో నూతన అధ్యాయం