కరోనా మృతులకు అంతిమ సంస్కారాల నిర్వహణ విషయంలో అవమానకరమైన ఘటనలు వెలుగుచూస్తున్న వేళ.. కేంద్రానికి కీలక సూచనలు చేసింది జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ). మరణించిన వారి గౌరవ ప్రతిష్ఠలు కాపాడేలా కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర సర్కార్లకు సూచించింది.
ఈ మేరకు అనేక ప్రతిపాదనలు చేసిన ఎన్హెచ్ఆర్సీ.. సామూహిక అంత్యక్రియలు జరగకుండా నివారించాలని పేర్కొంది. సామూహిక ఖననాలు.. మరణించిన వారి గౌరవాన్ని దిగజార్చుతాయని అభిప్రాయపడింది.