EMRS recruitment 2023 notification : ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. 'ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్'లో 38,480 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
టీచింగ్ పోస్టుల వివరాలు:
- ప్రిన్సిపల్ - 740 పోస్టులు
- వైస్-ప్రిన్సిపల్ - 740 పోస్టులు
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ - 8,140 పోస్టులు
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (కంప్యూటర్ సైన్స్) - 740 పోస్టులు
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ - 8,880 పోస్టులు
- ఆర్ట్ టీచర్ - 740 పోస్టులు
- మ్యూజిక్ టీచర్ - 740 పోస్టులు
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ - 1,480 పోస్టులు
నాన్-టీచింగ్ పోస్టులు :
- లైబ్రేరియన్ - 740 పోస్టులు
- స్టాఫ్ నర్స్ - 740 పోస్టులు
- హాస్టల్ వార్డెన్ - 1,480 పోస్టులు
- అకౌంటెంట్ - 740 పోస్టులు
- కేటరింగ్ అసిస్టెంట్ - 740 పోస్టులు
- చౌకీదార్ - 1,480 పోస్టులు
- కుక్ - 740 పోస్టులు
- కౌన్సిలర్ - 740 పోస్టులు
- డ్రైవర్ - 740 పోస్టులు
- ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ - 740 పోస్టులు
- గార్డెనర్ - 740 పోస్టులు
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 1,480 పోస్టులు
- లాబ్ అటెండెంట్ - 740 పోస్టులు
- మెస్ హెల్పర్ - 1,480 పోస్టులు
- సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 740 పోస్టులు
- స్వీపర్ - 2,220 పోస్టులు
విద్యార్హతలు :
- ప్రిన్సిపల్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. అలాగే బీఈడీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
- పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (కంప్యూటర్ సైన్స్) అభ్యర్థులు ఎమెస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ) లేదా ఎంసీఏ చేసి ఉండాలి.
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పాస్ అయ్యుండాలి.
- ఆర్ట్ టీచర్ పోస్టులకు ఫైన్ ఆర్ట్స్/ క్రాఫ్ట్స్‌లో డిగ్రీ చేసి ఉండాలి.
- మ్యూజిక్ టీచర్ పోస్టులకు సంగీతంలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి.