కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామని ముంబయిలోని సీఆర్పీఎఫ్ కార్యాలయానికి ఓ మెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.
"ఉగ్రవాదులు, ఆత్మాహుతిదళ సభ్యులు చురుకుగా ఉన్నారు. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంలో ఉన్నారు" అని ఆ మెయిల్లో ఉంది.