Elephant Tramples odisha Woman: జనావాసాల్లోకి వచ్చే ఏనుగులు ఒక్కోసారి స్థానిక ప్రజలపై దాడులు చేయడాన్ని చూస్తూనే ఉన్నాం. ఇలా ఒడిశాలో ఓ ఏనుగు వింత ప్రవర్తనతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఓ 70 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. ఆమె అంత్యక్రియల సమయంలోనూ ఆ ఏనుగు మరోసారి దాడి చేయడం కలకలం సృష్టించింది. ఇలా వృద్ధురాలిని చంపిన ఘటనలో ఏనుగు వింత ప్రవర్తన అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
ఒడిశా మయుర్‌భంజ్ జిల్లా రాయ్‌పాల్ గ్రామంలో మాయా ముర్ము అనే ఓ వృద్ధురాలు గొట్టపుబావి నుంచి నీటిని తీసుకుంటోంది. అదే సమయంలో దాల్మా వన్యప్రాణల సంరక్షణ కేంద్రం నుంచి దారితప్పి వచ్చిన ఓ ఏనుగు ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. కిందపడేసి తొక్కడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు రస్‌గోవింద్‌పుర్ ఇన్‌స్పెక్టర్ నాయక్ వెల్లడించారు.