చైనాలోని రిజర్వు అటవీ ప్రాంతం నుంచి గతేడాది బయటకు వచ్చిన ఏనుగుల గుంపు.. ఎట్టకేలకు తిరిగి తమ ఆవాసానికి చేరుకున్నాయి. 14 ఆసియా ఏనుగుల మంద నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌కు తిరిగి వచ్చాయి.
కొన్ని నెలల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణం చేసిన సంచార ఏనుగులు.. గత ఐదు రోజులుగా యుగ్జీ నగరం సమీపంలో తిరిగాయి. స్థానిక అధికారులు డ్రోన్ల సాయంతో వాటి కదలికలను పర్యవేక్షించారు. ట్రక్కులు అడ్డుపెట్టి ఏనుగులు తమ ఆవాసానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. యువాంగ్జియాంగ్ నది దాటేలా చర్యలు తీసుకున్నారు గురువారం యుగ్జీ నగరం నుంచి ఏనుగుల మంద అడవుల్లోకి తమ ప్రయాణం కొనసాగించింది. అయితే వాస్తవ ఆవాసానికి పూర్తిగా చేరుకోనప్పటికీ.. ఏనుగులు ప్రస్తుతం వాటికి అనువైన ప్రదేశంలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు.
వందల కి.మీ ప్రయాణం