తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఏనుగు విడుదల! - ఉత్తర్​ప్రదేశ్​

ఓ వ్యక్తిని చంపిన కేసులో ఏడాదిన్నర కాలం పాటు మిత్తూ అనే ఏనుగుకు శిక్ష పడింది. అనారోగ్య కారణాల వల్ల ఆ ఏనుగు విడుదల కాబోతోంది.

Elephant
ఏనుగు

By

Published : May 16, 2021, 7:41 PM IST

ఓ వ్యక్తిని చంపిన కేసులో శిక్ష అనుభవిస్తున్న ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన మిత్తూ అనే ఏనుగు విడుదల కాబోతోంది. ఈ మేరకు ఉత్తర్​ప్రదేశ్​ కమిషనర్​ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న మిత్తూ అనే ఏనుగు

అసలేం జరిగింది..

2020 అక్టోబర్​ 20న రామ్​లీలా మైదానంలో మిత్తు అనే ఏనుగు ప్రదర్శన చేసి తిరిగి వస్తుండగా దారిలో కొందరు దాన్ని వేధించారు. దాంతో దానికి కోపం వచ్చి ఒకరిని చంపేసింది.

మిత్తూ

ఏనుగు మిత్తు, దాని యజమాని మహౌత్​ మీద బాబురీ పోలీసు స్టేషన్​లో ఐపీసీ సెక్షన్​ 302 ప్రకారం కేసు నమోదయింది. మహౌత్​కు బెయిల్ వచ్చింది. కానీ మిత్తుకి ఏదాదిన్నర శిక్ష పడింది. ఆ ఏనుగును బిహార్​లోని చందౌలీ రాంనగర్​ అటవీ జంతు సంరక్షణాలయంలో పర్యవేక్షణలో ఉంచారు.

హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఏనుగు

అయితే ఎక్కువ రోజులు బందించే ఉంచడం వల్ల ఏనుగు సరిగా కూర్చోలేక, నడవలేక పోతోంది. ఈ విషయం వారణాసి కమిషనర్​కు తెలిసింది. వెంటనే ఆయన దాన్ని పెరోల్​ మీద బయటకు తీసుకురావాలని దిల్లీ జూ డైరక్టర్​ రమేశ్​ పాండేతో మాట్లాడారు. త్వరలో మిత్తూని లఖింపుర్​ ఖేరీలోని దుద్వా జాతీయ పార్క్​లో విడిచిపెట్టనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:రోజంతా రావిచెట్టుపైనే మకాం.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details