ఝార్ఖ్ండ్లో ఓ ఏనుగు భీభత్సం సృష్టించింది. రాంచీ జిల్లా కాన్కే గ్రామంలోని ఇళ్ల ప్రహరీ గోడలను కూల్చివేసింది.
గజరాజు వీరంగం- వ్యక్తి పరిస్థితి విషమం - రాంచీలో ఏనుగు కలకలం
ఝార్ఖండ్‌లోని రాంచీలో ప్రజలను భయాందోళనలకు గురిచేసింది ఓ ఏనుగు. ఓ గ్రామంలోకి చొరబడి ఇళ్ల గోడలు బద్దలుకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, అతడి పరిస్థితి విషమంగా ఉంది.
గజరాజు వీరంగంతో వ్యక్తి పరిస్థితి విషమం
ఏనుగును అడవిలోకి పంపించడానికి అటవీ అధికారులు, గ్రామంలోని యువత విఫలయత్నం చేశారు. అయితే అది గ్రామంలోకి దూసుకొచ్చి దాడి చేయడం మొదలుపెట్టింది. ఏనుగును అదుపు చేసే క్రమంలో ఓ యువకుడు దానికి చిక్కాడు. అతడిని తొండంతో ఈడ్చి పడేయగా.. తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.