తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ఏనుగుకు రేషన్ బియ్యం మహా ఇష్టం- అందుకే ఆ ఊరి జనానికి అంత కష్టం!

Elephant Attack in Kerala: కేరళ ఇడుక్కి జిల్లాలోని ఓ​ ప్రాంతంలో ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. రేషన్ ​దుకాణాలపై దాడి చేసి.. బియ్యాన్ని తినేస్తుంది. దీంతో బియ్యం అందక ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Elephant attack in Kerala
Elephant attack in Kerala

By

Published : Jan 7, 2022, 3:19 PM IST

Elephant Attack in Kerala: కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఓ ప్రజలకు మూడురోజులుగా రేషన్​ బియ్యం అందడం లేదు. రాత్రికిరాత్రే రేషన్​ దుకాణంలోని బియ్యం బస్తాలు మాయమైపోతున్నాయి. దొంగలెవరో దీనికి కారణం అనుకుంటే పొరపాటే. ఇదంతా చేసింది ఓ ఏనుగు.

ఇంతకీ జరిగిందంటే..?

ఆహారం కోసం వెతుకుతూ.. జనావాసాల్లోకి వచ్చిన ఓ ఏనుగు రేషన్​ దుకాణాలపై దాడి చేసి బియ్యాన్ని తినేస్తోంది. రేషన్​ దుకాణాలను ధ్వంసం చేసి.. బియ్యాన్ని ఆరగించేస్తోంది. ఆ ప్రాంతంలో గడిచిన మూడు రోజులుగా ఇదే జరుగుతోంది. దీంతో స్థానికులు ఆ ఏనుగుకు 'అరికంబన్​' (బియ్యం దొంగ) అని పేరు పెట్టారు. అరికంబన్​ను తరిమేందుకు స్థానికులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అది అక్కడ నుంచి ఒక్క అడుగు కూడా కదలడం లేదు. వారంతా అరిచి గోల పెట్టినా.. తనకేమీ పట్టనట్టు బియ్యాన్ని తింటోంది.

ఒకవేళ రేషన్​ దుకాణంలో బియ్యం లేకపోతే ఏకంగా ఇళ్లపై దాడి చేస్తోంది. దీంతో ప్రజలు ప్రాణ భయంతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలంటూ అధికారులను కోరుతున్నారు.

ఇదీ చూడండి:పట్టపగలే రెండు హత్యలు.. పోలీసులపై గ్రెనేడ్ దాడులు.. ఇద్దరు నిందితులు హతం

ABOUT THE AUTHOR

...view details