నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న ఎన్నికల భద్రతకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దిల్లీలో సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, పోలీసు నోడల్ ఆఫీసర్, సీఏపీఎఫ్ సమన్వయ కర్తతో కూడిన కమిటీ.. ఎన్నికల భద్రతా ప్రణాళికను సిద్ధం చేస్తాయని తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికల భద్రతపై ఈసీ కీలక భేటీ
అసోం, బంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో జరిగే శాసనసభ ఎన్నికల భద్రతకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దిల్లీలో సమావేశమైంది. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎన్నికల పర్యవేక్షకులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఎన్నిల భద్రతకు సంబంధించి ఈసీ ఆదేశాలు
భద్రతా బలగాల తరలింపును ప్రత్యేక, జనరల్, పోలీసు అధికారులు పర్యవేక్షిస్తారని ఈసీ తెలిపింది. ఒకవేళ భద్రతా దళాల తరలింపులో మార్పులేమన్నా చేయాలని ప్రత్యేక పోలీసు అధికారి సూచిస్తే.. దానికి అనుగుణంగా ప్రణాళికను మార్చాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, పోలీసు నోడల్ ఆఫీసర్, సీఏపీఎఫ్ సమన్వయకర్తతో కూడిన కమిటీని ఆదేశించింది. ఇదే నిబంధన జిల్లా ఎన్నికల అధికారితో కూడిన కమిటీకి వర్తిస్తుందని తెలిపింది.
ఇదీ చూడండి:రాజకీయ పార్టీలతో ముగిసిన ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం