తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దీదీ, స్టాలిన్​, విజయన్​లకు మోదీ శుభాకాంక్షలు - WestBengalPolls 2021

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మమత, విజయన్, స్టాలిన్​లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భాజపాకు మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కట్టడిలో కేంద్రం మద్దతు పూర్తిగా ఉంటుందని హామీ ఇచ్చారు.

pm modi
ప్రధాని నరేంద్ర మోదీ

By

Published : May 2, 2021, 9:12 PM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తృణమూల్​ కాంగ్రెస్​, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. కరోనా కట్టడిలో కేంద్రం మద్దతు పూర్తిగా ఉంటుందని హామీ ఇచ్చారు.

దీదీకి శుభాకాంక్షలు

"బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మమతా బెనర్జీకి శుభాకాంక్షలు. బంగాల్‌ప్రజలు కరోనాను జయించేందుకు కేంద్రం సహకరిస్తుంది. భాజపాను ఆదరించిన బంగాల్‌ ప్రజలకు ధన్యవాదాలు. బంగాల్‌లో గతం కంటే మా పార్టీ బాగా పుంజుకుంది. బంగాల్‌లో క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు."

-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

స్టాలిన్​, విజయన్​లకు శుభాకాంక్షలు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​, డీఎంకే అధినేత ఎం.కే స్టాలిన్ కు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ అభివృద్ధి కోసం తాము కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా కొవిడ్-19 ను ఎదుర్కుందామని కోరారు. అసోం ప్రజలు భాజపాను మరోసారి దీవించారని ప్రధాని మోదీ అన్నారు. అసోంలో ఎన్​డీఏ కూటమి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే విజయాన్ని చేకూర్చాయన్నారు. భాజపా కోసం నిర్విరామంగా కృషి చేసిన ప్రతికార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కార్యకర్తల నిరంతర శ్రమను ప్రశంసించారు.

ఉపఎన్నికలు జరిగిన కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ ఓటర్లకు సైతం కృతజ్ఞతలు తెలిపారు. తమ పార్టీ ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు.

ఇదీ చదవండి :యానాంలో మాజీ సీఎం రంగస్వామి ఓటమి

ABOUT THE AUTHOR

...view details