తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రికార్డు స్థాయి'లో ఎన్నికల్లో ఓడి కేరళ సీఎం​కు పోటీగా.. - అసెంబ్లీ ఎన్నికలు

ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ ప్రతీ ఎన్నికల్లో పోటీ చేయడం ఆయన ప్రత్యేకత. బరిలో ఎవరున్నారు అనేది అనవసరం. గెలుపు మీద అసలు ఆశే ఉండదు. ఓడిపోవడం కొత్తేం కాదు. ఇలా 200కుపైగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి.. లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డుల్లో స్థానం సంపాదించారు. ఆయనే తమిళనాడు సేలంకు చెందిన టైర్ల వ్యాపారి పద్మరాజన్​. తెలిసిన వారు ఆయన్ని ఎన్నికల రారాజుగా పిలుచుకుంటారు. ఆ పద్మరాజన్​ ఇప్పుడు కేరళ సీఎం పినరయి విజయన్​పైనే పోటీకి దిగుతున్నారు.

'Election King' to contest against Pinarayi Vijayan
ఎన్నికల్లో ఓడిపోయి.. రికార్డులకు ఎక్కి...

By

Published : Mar 16, 2021, 7:32 PM IST

దేశంలో ఎన్నికల రారాజుగా పేరుగాంచిన పద్మరాజన్ వచ్చే ఎన్నికల్లో కేరళలోని ధర్మాదం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఏకంగా.. ముఖ్యమంత్రి, సీపీఎం నేత పినరయి విజయన్​పైనే బరిలోకి దిగుతున్నారు.

ఇప్పటివరకు రెండు వందలసార్లకుపైగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్కదాంట్లోనూ గెలవకపోవడం గమనార్హం.

పద్మరాజన్​

లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డుల్లో స్థానం..

దేశంలో జరిగిన ఎన్నికల్లో ఎక్కువసార్లు ఓడిపోయిన అభ్యర్థిగా లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డ్​, గిన్నిస్​ వరల్డ్​ రికార్డుల్లో స్థానం సంపాదించారు పద్మరాజన్​. ఇప్పటివరకు సుమారు 216 సార్లు ఎన్నికల్లో నామపత్రాలు దాఖలు చేసిన ఆయన ఒక్కసారి కూడా గెలవలేదు. ఇప్పటివరకు ఎన్నికల కోసం ఆయన రూ. 50 లక్షలు వెచ్చించడం విశేషం.

లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డుల్లో స్థానం
గిన్నిస్​ రికార్డు

బరిలో ఎవరున్నారు అనేది అనవసరం..

ఎన్నిక​ ఏదైనా, బరిలో ఎవరున్నా.. తనకు అనవసరమని అంటారు ఎలక్షన్​ కింగ్​. ప్రత్యర్థి ప్రధాని అయినా, రాహుల్​ గాంధీ అయినా లెక్కచేయరు. ఇలానే 2014 లోక్​సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీపై వడోదర నుంచి పోటీ చేశారు. కేరళలో రాహుల్​కూ సవాల్​ విసిరారు. రెండింట్లోనూ ఓడారు.

దానికోసమే పోటీ చేస్తున్నా..

ఎన్నికలు కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే కాదని అంటారు పద్మరాజన్​. ప్రతి సామాన్యుడూ పోటీ చేయగలడని రుజువు చేయడమే తన ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ ఆలోచనతోనే తొలుత 1988లో తమిళనాడు సేలంలోని మెట్టూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశానని చెప్పుకొచ్చారు.

2017 ఎన్నికల్లో పోటీ

ప్రచారం చేస్తారా..?

ఎన్నికల్లో పోటీ చేయడం, నామపత్రాలు దాఖలు చేయడం మాత్రమే తన వంతు అంటారు పద్మరాజన్​. రాబోయే ఎన్నికల్లో ధర్మాదం నుంచి పోటీ చేస్తున్న ఆయన్ను ప్రచారం చేస్తారా అని అడిగితే.. అందుకు తనకు సమయం లేదని అన్నారు. తమిళనాడులోని మరో నాలుగు సీట్లకు నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు.

ఇదీ చూడండి: కేరళ సీఎం విజయన్​ నామినేషన్​ దాఖలు

ABOUT THE AUTHOR

...view details