బంగాల్ రెండో దశ పోలింగ్‌లో నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ బూత్‌లో అవకతవకలు జరిగాయన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని, నిరాధారమైనవని పేర్కొంది.
మమత ఆరోపణలన్నీ అవాస్తవాలే: ఈసీ - mamata benarjee allegations on election commission
నందిగ్రామ్ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్‌లో అవకతవకలు జరిగాయన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలు.. పూర్తిగా అవాస్తవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వాటికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది.
![మమత ఆరోపణలన్నీ అవాస్తవాలే: ఈసీ Election Commission](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11274810-thumbnail-3x2-111.jpg)
మమత ఆరోపణలన్నీ అవాస్తవాలే: ఈసీ
బంగాల్లో రెండోదశ పోలింగ్ తీరుపై ఎన్నికల సంఘాన్ని మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనలతోనే ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు జరిగినా.. అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ఈసీకి 63 ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి:బంగాల్లో ఆడియో టేపుల కలకలం