నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు.. పంజాబ్ నుంచి 38 మంది ఐఏఎస్, 12 మంది ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వారిలో తొమ్మిది మంది అధికారులు సోమవారం కరోనా టీకా తీసుకున్నట్లు పంజాబ్ ఎన్నికల అధికారి తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలకు అధికారులను నియమించిన ఈసీ - Election Commission of India
అసెంబ్లీ ఎన్నికల కోసం పంజాబ్ నుంచి 38 మంది ఐఏఎస్, 12 మంది ఐపీఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. నియమితులైన అధికారుల్లో సోమవారం తొమ్మిది మంది కరోనా టీకా తీసుకున్నట్లు పంజాబ్ ఎన్నికల అధికారి తెలిపారు.
ఎన్నికలకు 38 ఐఏఎస్, 12 ఐపీఎస్‌లను నియమించిన ఈసీ
బంగాల్లో 8 విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. అసోంలో 3 దశల్లో నిర్వహించనున్నారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఎన్నికలు మార్చి 27న మొదలై.. ఏప్రిల్ 29న ముగియనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడించనున్నారు.
ఇదీ చదవండి:సైకత శిల్పంతో మహిళలకు శుభాకాంక్షలు
Last Updated : Mar 8, 2021, 10:53 AM IST