తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక్‌జన్‌శక్తి పార్టీ గుర్తును ఫ్రీజ్​ చేసిన ఈసీ - చిరాగ్​ పాస్​వాన్​ న్యూస్​

Election Commission of India (ECI) freezes Lok Janshakti Party's symbol
లోక్‌జన్‌శక్తి పార్టీ గుర్తును ఫ్రీజ్​ చేసిన ఈసీ

By

Published : Oct 2, 2021, 3:25 PM IST

Updated : Oct 2, 2021, 5:06 PM IST

15:22 October 02

లోక్‌జన్‌శక్తి పార్టీ గుర్తును స్తంభింపజేసిన ఈసీ

లోక్​ జనశక్తి పార్టీపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న ఆ పార్టీ నేతలు చిరాగ్​ పాస్​వాన్​, పశుపతి కుమార్‌కు ఎన్నికల కమిషన్​ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తును కొంతకాలం పాటు ఫ్రీజ్​ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్​ 30న జరగనున్న ఉపఎన్నికల్లో ఇరు వర్గాల నేతలు స్వతంత్ర గుర్తులపై పోటీ చేయాలని సూచించింది.

'పార్టీలోని ఇరువర్గాల మధ్య వివాదాలు పరిష్కారమయ్యే వరకు ఎల్​జేపీ గుర్తును ఫ్రీజ్​ చేస్తున్నాం. రెండు గ్రూపులు పోటీ చేయవచ్చు. వారు కోరుకుంటే లోక్​ జనశక్తి పార్టీతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది' అని ఎన్నికల కమిషన్​ ఉత్తర్వుల్లో పేర్కొంది.  

బిహార్‌ ఎన్నికలకు ముందు.. ఎల్​జేపీ అధినేత రామ్‌విలాస్‌ పాసవాన్‌ చనిపోగానే.. ఆయన కుమారుడు చిరాగ్‌ పాసవాన్‌ పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే  అత్యంత నాటకీయంగా చిరాగ్​​ను లోక్ జనశక్తి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు అసమ్మతి నేతలు. పార్టీ కార్యనిర్వాహక ఆధ్యక్షుడిగా సూరజ్‌భాన్ సింగ్​ను నియమించారు. అదే సమయంలో... లోక్​ జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) లోక్​సభాపక్ష నేతగా కేంద్ర మంత్రి పశుపతి కుమార్​ పరాస్ ఆ పార్టీలోని ఐదుగురు ఎంపీలు ఎన్నుకున్నారు. ఇలా ఇరువురి మధ్యన పార్టీపై పట్టుకోసం వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల గుర్తు ఫ్రీజ్ చేయాలని ఈసీ నిర్ణయించింది.

Last Updated : Oct 2, 2021, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details