తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డూప్లికేట్, డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు - సీఈవో

Election_Commission
Election_Commission

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 7:01 PM IST

Updated : Dec 8, 2023, 8:30 PM IST

18:59 December 08

ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలి: సీఈవో

Election Commission Key Orders to Collectors: ఏపీలో డూప్లికేట్ ఓటు, డబుల్ ఓట్లపై ఎన్నికల సంఘం(Election Commission) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఓ వ్యక్తికి ఎక్కువ చోట్ల ఓట్లు ఉండడం నిబంధనలకు విరుద్ధమని, తప్పుడు డిక్లరేషన్ ఇచ్చేవారిపై కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. తప్పుడు డిక్లరేషన్‌తో ఓటుకు దరఖాస్తు చేస్తే జైలుశిక్షకి అర్హులన్న సీఈవో కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు.

వేరే ఎక్కడా తమకు ఓటు లేదని సదరు ఓటరు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే కొత్త ఓటరుగా నమోదు చేయాలని సీఈవో వెల్లడించారు. 20 ఏళ్లు పైబడిన వారు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేస్తే అధికారులు విచారించి రిమార్క్ ఇవ్వాలని సూచించారు. ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటు హక్కు ఉండేలా చూడాలన్నారు. ఇళ్లు మారే వారు ఓటుకు ఫామ్ 8 ద్వారా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా తప్పుడు డిక్లరేషన్ సమర్పిస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

YCP Complaint on Duplicate and Double Votes: హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో ఓట్లు ఉన్నవారికి ఇక్కడ కూడా ఓట్లు ఉన్నాయని, ఇది నిబంధనలకు విరుద్ధమని వైసీపీ నేతలు ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం డూప్లికేట్, డబుల్ ఓట్లపై కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఒక ఓటరుకు ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండాలని స్పష్టం చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈవో ఎం.కె. మీనా కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

Last Updated : Dec 8, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details