తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అబ్బాయికి హెలికాప్టర్.. బాబాయికి కుట్టుమిషన్.. లెక్క తేల్చిన ఈసీ!

లోక్ ​జనశక్తి పార్టీ(LJP news) నేతలు చిరాగ్​ పాస్​వాన్​, పశుపతి కుమార్‌కు వేర్వేరుగా పార్టీ పేర్లను, ఎన్నికల గుర్తులను కేటాయించింది ఎన్నికల సంఘం(ఈసీ). చిరాగ్​ పాసవాన్​కు హెలికాప్టర్​ను ఎన్నికల గుర్తుగా కేటాయించిన ఈసీ.. పశుపతి కుమార్​ పరాస్​కు 'కుట్టుమిషన్'​ గుర్తు ఇచ్చినట్లు తెలిపింది.

Election Commission
ఎన్నికల సంఘం

By

Published : Oct 5, 2021, 1:39 PM IST

లోక్​ జనశక్తి పార్టీ(LJP news) పేరు, గుర్తును కొంతకాలం పాటు ఫ్రీజ్​ చేసిన ఎన్నికల సంఘం.. ఆ పార్టీ నేతలు(lok janshakti party leader) చిరాగ్​ పాస్​వాన్​, పశుపతి కుమార్‌కు తాత్కాలికంగా వేర్వేరుగా పార్టీ పేర్లు, ఎన్నికల గుర్తులు కేటాయించింది.

చిరాగ్​ పాస్​వాన్​కు 'లోక్​ జనశక్తి పార్టీ(రామ్​విలాస్​)' (chirag paswan party)పేరును, 'హెలికాప్టర్​ను' ఎన్నికల గుర్తుగా కేటాయించినట్లు తెలిపింది.

అలాగే పశుపతి కుమార్​ పరాస్​కు 'రాష్ట్రీయ లోక్​జనశక్తి పార్టీ' పేరును కేటాయించిన ఈసీ.. 'కుట్టుమిషన్'​ను ఎన్నికల గుర్తుగా ఇచ్చినట్లు స్పష్టం చేసింది.

"మీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. మీ వర్గానికి 'రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ' పేరును ఖరారు చేసింది. ప్రస్తుతానికి మీ వర్గం తరఫున ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి 'కుట్టు మిషన్​'ను గుర్తును కేటాయించింది" అని ఆదేశాల్లో తెలిపింది.

పార్టీలోని ఇరువర్గాల మధ్య వివాదాలు పరిష్కారమయ్యే వరకు ఎల్​జేపీ పేరు, పార్టీ గుర్తు 'బంగ్లా'ను(lok janshakti party symbol) కొంతకాలం పాటు ఫ్రీజ్​ చేస్తున్నట్లు అక్టోబరు 2 ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. లోక్​ జనశక్తి పార్టీపై ఆధిపత్యం కోసం చిరాగ్‌, ప‌శుప‌తి మ‌ధ్య కొన్నాళ్లుగా వైరం నెలకొంది. వీరిద్దరూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించగా.. ఈసీ దీనిపై స్పష్టతనిచ్చింది.

బిహార్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30న ఉప ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:లోక్‌జన్‌శక్తి పార్టీ గుర్తును ఫ్రీజ్​ చేసిన ఈసీ

ABOUT THE AUTHOR

...view details