తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీ ఎన్నికల నిర్వహణపై ఈసీ క్లారిటీ

వచ్చే ఏడాది యూపీ, పంజాబ్​ సహా 5 రాష్ట్రాలకు అనుకున్న సమయానికి ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ సుశీల్​ చంద్ర సోమవారం వెల్లడించారు. కరోనా వేళ ఈ ఏడాది బంగాల్​ సహా 5 అసెంబ్లీలకు నిర్వహించిన పోలింగ్​తో తగిన అనుభవం సంపాదించామన్నారు.

Election Commission
అసెంబ్లీ ఎన్నికలు

By

Published : Jun 1, 2021, 3:35 PM IST

Updated : Jun 1, 2021, 4:10 PM IST

వచ్చే ఏడాది ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్​ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సకాలంలో నిర్వహిస్తామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్​ సుశీల్​ చంద్ర సోమవారం విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ ఏడాది మహమ్మారి నేపథ్యంలోనూ బిహార్​, బంగాల్​ సహా మరో 4 అసెంబ్లీలకు పోలింగ్​ నిర్వహణతో తగిన అనుభవం సంపాదించినట్లు తెలిపారు.

"శాసనసభ గడువు ముగిసే లోపు ఎన్నికలు నిర్వహించడం, గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గవర్నర్​కు పంపడం ఎన్నికల కమిషన్ ప్రధాన విధి."

- సుశీల్ చంద్ర, భారత ఎన్నికల ప్రధాన కమిషనర్

గోవా, మణిపుర్​, పంజాబ్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాల శాసనసభ గడువు 2022 మార్చితో ముగియనుండగా.. యూపీ అసెంబ్లీ వ్యవధి మేతో పూర్తి అవుతుంది.

కరోనా రెండో దశ ఉద్ధృతి కారణంగా పలు రాజ్యసభ ఉపఎన్నికలు, శాసనమండలి ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీనిపై స్పందిస్తూ.. కొవిడ్​ తీవ్రత, కేసులు తగ్గుతున్నాయని.. మహమ్మారి సమయంలోనూ ఎన్నికలు ఎలా నిర్వహించాలనే దానిపై తాము పూర్తి అవగాహన సంపాదించినట్లు సుశీల్​ చంద్ర తెలిపారు.

ఇదీ చూడండి:మోదీ మీటింగ్​లో దీదీ తీరుపై కేంద్రం గుస్సా

Last Updated : Jun 1, 2021, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details