తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రైతులకు నమ్మకద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్​ది' - పంజాబ్ ఎన్నికలు 2022

Election 2022: రైతులను నమ్మకద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్​దని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ భక్తి నుంచి స్ఫూర్తి పొందిన ప్రభుత్వం పంజాబ్​కు ఇప్పుడు అవసరమని అన్నారు.

Election 2022
మోదీ

By

Published : Feb 17, 2022, 1:26 PM IST

Updated : Feb 17, 2022, 2:40 PM IST

Election 2022: రైతులకు నమ్మక ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్​దని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. స్వామినాథన్ కమిషన్​ను అమలు చేయకుండా చాలా ఏళ్లుగా అబద్ధాలతో గడిపేశారని దుయ్యబట్టారు. కానీ తాము అధికారంలోకి రాగానే స్వామినాథన్ కమిషన్​ను అమలు చేసినట్లు తెలిపారు. భాజపా ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయని చెప్పారు. పంజాబ్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే భాజపా కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఫిబ్రవరి 20న పంజాబ్​లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో భాజపా ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వం..

రాష్ట్రంలో వాణిజ్యం మాఫియా చేతిలో నలిగిపోతోందని మోదీ ఆరోపించారు. ప్రభుత్వ ప్రతికూల నిర్ణయాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదని అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఓటర్లను కోరారు. అభివృద్ధి, మాఫియా, డ్రగ్ మాఫియా నిర్మూలన, ఉద్యోగ, వ్యాపార అవకాశాలను పెంపొందించడమే డబుల్ ఇంజిన్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:15వేల అడుగుల ఎత్తు, మోకాలి లోతు మంచులో పహారా

Last Updated : Feb 17, 2022, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details