Chhatarpur Mobile Battery Explosion: మొబైల్ బ్యాటరీ పేలిన ఘటనలో ఎనిమిదేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్పుర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఛత్తర్పుర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. బాలుడి.. కళ్లు, మొహం, చాతీ భాగాలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు చెప్పారు.
పాత మొబైల్ బ్యాటరీతో ఆట.. పాపం ఎనిమిదేళ్ల బాలుడు... - ఛత్తర్పుర్ న్యూస్
Chhatarpur Mobile Battery Explosion: మధ్యప్రదేశ్‌లో మొబైల్ బ్యాటరీ పేలడం వల్ల ఎనిమిదేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో ఆడుతూ.. బ్యాటరీకి కరెంట్ వైర్లు కలపడం వల్ల అది పేలింది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
ఇదీ జరిగింది: ఛత్తర్పుర్లోని నజర్భాగ్ ప్రాంతానికి చెందిన ఇస్క్తర్ ఖాన్ కుమారుడు.. ఇంట్లో చెడిపోయిన మొబైల్ బ్యాటరీతో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కరెంట్ వైర్లను బ్యాటరీతో కలిపాడు. దీంతో బ్యాటరీ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. పేలుడు శబ్దం విన్న కుటుంబ సభ్యులు వెళ్లగా.. రక్తంతో ఉన్న బాలుడిని చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కుమారుడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పిల్లలు మొబైల్‌తో ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని డాక్టర్లు కోరారు. గతంలో ఛత్తర్పుర్లోనే బ్యాటరీ పేలుడు కారణంగా 12 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఇదీ చదవండి:'భాజపా వల్ల దేశంలో చీలిక.. త్వరలో ఉక్రెయిన్ తరహా పరిస్థితులు!'