తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, గొంతు కోసి, ముఖం ఛిద్రం చేసి హత్య - haryana news

ఎనిమిదేళ్ల చిన్నారిని కిడ్నాప్​ చేసి అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. అంతటితో ఆగకుండా చిన్నారి గొంతు కోసి హత్య చేసి నది ఒడ్డున పడేశాడు. ఈ దారుణ ఘటన దిల్లీలో జరిగింది. మరోవైపు, హరియాణాలో చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

eight-year-old-innocent-murdered-after-rape-in-delhi
eight-year-old-innocent-murdered-after-rape-in-delhi

By

Published : Aug 22, 2022, 9:39 PM IST

దేశ రాజధాని దిల్లీలో అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో ఉన్న ఓ ఎనిమిదేళ్ల చిన్నారిని అపహరించి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ 36 ఏళ్ల కిరాతకుడు. ఆ తర్వాత ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా చిన్నారి మృతదేహాన్ని యుమునా నది ఒడ్డున పడేశాడు ఆ నర హంతకుడు.

పోలీసుల సమాచారం ప్రకారం..
బాధితురాలు తల్లిదండ్రులు రోజువారీ కూలీ పనులకు వెళ్తుంటారు. ఆగస్టు 5వ తేదీన నిందితుడు చిన్నారిని కిడ్నాప్​ చేశాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత చిన్నారి ముఖాన్ని ఛిద్రం చేసి యమునా నది ఒడ్డున పడేసి వెళ్లిపోయాడు.

అయితే తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆగస్టు 18న యుమనా నది సమీపంలో గడ్డి కోయడానికి వెళ్లిన మహిళలు.. చిన్నారి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు వైద్యులు తెలిపారు. గాలింపు చర్యలను వేగవంతం చేసిన పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

చాక్లెట్లు ఆశ చూపి మైనర్​పై లైంగిక వేధింపులు
హరియాణాలోని గురుగ్రామ్​ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారిపై తరచుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్​ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం..సోహ్నా కాలనీకి చెందిన సాహిల్​.. అదే ప్రాంతంలో ఉంటున్న నాలుగేళ్ల బాధితురాలిపై లైంగికంగా వేధిస్తున్నాడు. ఆగస్టు 15న చిన్నారి ఇంటికి వెళ్లిన సాహిల్​.. చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపించి తన రూమ్​కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత మైనర్​ను తనతో సెక్స్​ చేయమని బలవంతం చేశాడు. కాసేపటికి ఏడుస్తూ ఇంటికి వచ్చిన చిన్నారిని ఆమె తల్లి.. ఏం జరిగిందని అడిగింది. అప్పుడు జరిగిన విషయమంతా చిన్నారి.. తన తల్లికి చెప్పింది. వెంటనే పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్​ చేశారు. విచారణలో నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు ఎస్​ఐ ఉమేశ్ కుమార్​ తెలిపారు.

అత్యాచార నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
రెండేళ్ల క్రితం యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఓ వ్యక్తికి రాజస్థాన్​లోని కోటా కోర్టు యావజ్జీవ కారగార శిక్ష విధించింది. దాంతో పాటు రూ.55,000 జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. కోటా నగరానికి చెందిన అరవింద్​ చౌహాన్.. తాను క్షుద్ర పూజల ద్వారా అనేక వ్యాధులను నయం చేస్తానని బాధితురాల్ని నమ్మించాడు. క్షుద్ర పూజలు చేస్తానని చెప్పి గతంలో బాధితురాలి ఇంటిలో 20 రోజులకుపైగా ఉన్నాడు. అదే సమయంలో పలుమార్లు యువతిపై నిందితుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు. ఆ తర్వాత బాధితురాలు 2020లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరపరిచారు. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.

ఇవీ చదవండి:119 ఏళ్ల వృద్ధుడి అంతిమయాత్రలో డీజే, ఉత్సాహంగా డ్యాన్సులు

డబ్బు ఆశతో క్షుద్రపూజలు, భార్యకు అందరిముందు నగ్నంగా స్నానం చేయించి

ABOUT THE AUTHOR

...view details