తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎనిమిదేళ్ల బాలికపై హత్యాచారం.. ఇసుకలో కప్పి పెట్టి.. - బీహార్​లో ఎనిమిదేళ్ల బాలికపై హత్యాచారం

Minor girl raped, murdered: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు కొందరు దుండగులు. ఈ ఘటన బిహార్​లోని బంకాలో జరిగింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

girl murdered
బాలిక ఇంటి వద్ద గుమ్ముగూడిన ప్రజలు

By

Published : Mar 21, 2022, 12:05 PM IST

Updated : Mar 21, 2022, 12:11 PM IST

Minor girl raped, murdered: బిహార్​లోని బంకాలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల చిన్నారిపై కొందరు దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం ఓ గుహ లాంటి ప్రదేశంలో బాలిక మృతదేహాన్ని ఇసుకతో కప్పారు. అయితే బాలిక కోసం వెతుకులాడిన గ్రామస్థులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఇదీ జరిగింది...

చిన్నారి హోలీ పండగ రోజున తన స్నేహితులతో ఆడుకుంటున్న చిన్నారి.. కొద్దిసేపటికే.. అక్కడ ఉన్న దుర్గ గుడి దగ్గర నుంచి కనిపించకుండా పోయినట్లు స్థానికులు పేర్కొన్నారు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. దీనిపై పోలీసులకు కూడా సమాచారం అందించారు. చిన్నారితో అడుకుంటున్న మరో బాలిక ఇచ్చిన సమాచారం ప్రకారం... చిన్నారిని ఓ ఎరుపు రంగు ఈ-రిక్షాలో తీసుకెళ్లినట్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు రిక్షా డ్రైవర్ కోసం వెతకడం ప్రారంభించారు. చివరకు డ్రైవర్​ సాగర్​ సోనీని కనుగొన్నారు.

ఈ ఘటనతో తనకు ఎటువంటి ప్రమేయం లేదని రిక్షా డ్రైవర్​ తెలిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. అసలు విషయం చెప్పారు. రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న గుహ లాంటి ప్రాంతంలో బాలిక మృతదేహం ఇసుకతో కప్పి పెట్టినట్లు వివరించారు. దీందో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రిక్షా డ్రైవర్ పరారీలో ఉన్నాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మార్కెట్​కు వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారం

మార్కెట్​కు వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. అనంతరం ఘటనాస్థలి నుంచి పారిపోయారు. బాధితురాలి మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజస్థాన్​లోని మౌంట్​ అబూ పర్వత ప్రాంతంలో జరిగింది.

మార్కెట్​కు వెళ్లి తిరిగి వస్తుండగా.. మ్యూజియం క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డట్టు బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఇదీ చూడండి:

నటుడు సురేశ్​గోపీ సోదరుడు అరెస్ట్​..!

Last Updated : Mar 21, 2022, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details