భారత్ నేతృత్వంలో సమావేశమైన (India meeting on Afghanistan) ఎనిమిది దేశాలు.. అఫ్గానిస్థాన్ అంశంలో కీలక అవగాహనకు వచ్చాయి. సుస్థిర, శాంతియుత, సురక్షితమైన అఫ్గానిస్థాన్ ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. అఫ్గాన్ సంక్షోభంపై చర్చించిన అనంతరం ఈ మేరకు 'దిల్లీ డిక్లరేషన్' పేరిట ఉమ్మడి ప్రకటన (India meeting on Afghanistan) విడుదల చేశాయి. అఫ్గానిస్థాన్‌లో నిజమైన సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాయి. అఫ్గాన్‌లోని అన్ని వర్గాల ప్రజలకు అందులో భాగస్వామ్యం కల్పించాలని పేర్కొన్నాయి.
అఫ్గాన్ సార్వభౌమత్వం, సమగ్రతకు గౌరవం ఇస్తున్నట్లు 'దిల్లీ డిక్లరేషన్'లో (NSA meet on Afghanistan) తెలిపాయి. అఫ్గాన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి వ్యతిరేకంగా (Delhi Declaration) తీర్మానించాయి. అయితే, అఫ్గాన్‌లో ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగకూడదని తేల్చిచెప్పాయి. ఆ దేశాన్ని ముష్కరులు ఉపయోగించకుండా చూడాలని స్పష్టం చేశాయి. ఉగ్ర శిక్షణ, ఆశ్రయం కల్పించడం, దాడులకు కుట్రలు, ఆర్థిక సహాయం సహా ఎలాంటి కార్యకలాపాలు ఉండకూడదని (Delhi Declaration UPSC) నొక్కిచెప్పాయి. అఫ్గాన్‌లో భద్రతాపరమైన పరిస్థితులు సహా ఉగ్రవాదం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడంపై ఎనిమిది దేశాలు (India meeting on Afghanistan) ఆందోళన వ్యక్తం చేశాయి. కుందుజ్, కాందహార్, కాబుల్ నగరాల్లో జరిగిన దాడులను ఖండించాయి.
"అఫ్గానిస్థాన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఐరాసది కీలక పాత్ర. అఫ్గాన్‌లో ఐరాస విభాగాలు తమ కార్యకలాపాలు కొనసాగించడం అవసరం. అఫ్గాన్‌లో సామాజిక ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో.. అక్కడి ప్రజలకు మానవతా సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉంది. అఫ్గాన్‌కు అందించిన సహాయం.. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమానంగా, వివక్ష లేకుండా అందాలి."
-దిల్లీ డిక్లరేషన్
రష్యా, ఇరాన్, తజికిస్థాన్, కిర్జిస్థాన్, కజఖ్‌స్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో భారత్.. ఈ భేటీ (NSA meeting on Afghanistan) నిర్వహించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్.. ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. ఈ చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు గర్వకారణమని సమావేశం (NSA meet on Afghanistan) సందర్భంగా డోభాల్ వ్యాఖ్యానించారు. అఫ్గానిస్థాన్ పరిస్థితులు అక్కడి ప్రజలపైనే కాకుండా.. పొరుగు దేశాలపైనా ప్రభావం చూపిస్తాయని అన్నారు.
మోదీని కలిసి...
ఈ సమావేశం అనంతరం డోభాల్‌తో పాటు ఏడు దేశాల ప్రతినిధులు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. వారితో మోదీ కాసేపు సమావేశమయ్యారు.