ఘోర రోడ్డుప్రమాదం- ఒకే కుటుంబంలోని 8 మంది మృతి - రోడ్డు ప్రమాదం
10:58 October 22
ఘోర రోడ్డుప్రమాదం- ఒకే కుటుంబంలోని 8 మంది మృతి
హరియాణా ఝజ్జర్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ కారును వెనుకనుంచి మరో వాహనం ఢీకొనగా.. అది మరో ట్రక్కుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మరొకరికి గాయాలయ్యాయి.
ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. బద్లీ ప్రాంతంలోని కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఈ దుర్ఘటన జరిగింది.
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. కారులో ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.