మైనర్ గ్యాంగ్‌రేప్ కేసులో పుణె పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు రైల్వే సిబ్బంది కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 31న రాత్రి పుణె రైల్వే స్టేషన్ నుంచి బాలికను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని పేర్కొన్నారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పారు.
బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తొలుతగా కిడ్నాప్ కేసు నమోదు చేశారని అధికారులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై బాలిక వాంగ్మూలం తీసుకున్న తర్వాత పోలీసులు నిందితులపై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సిటీ కమిషనర్ నమ్రతా పాటిల్ వివరించారు.