ఉత్తర్ప్రదేశ్ హర్దోయి జిల్లా హరియావా గ్రామంలోని శారదా నది.. ఒక్కసారిగా గుడ్డునదిలా మారిపోయింది. అదెలాగ అంటారా..? అవును.. శారదానదిలో ఒక్కసారిగా వేల గుడ్లు తేలియాడుతూ కనిపించాయి. గుడ్ల ప్రవాహం చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొంతమంది గ్రామస్థులు ఈ దృశ్యాలను చూస్తూ ఉండగా మరికొందరు మాత్రం.. నదిలోకి దూకి గుడ్లను సేకరించారు.
సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే.. గుడ్లు నదిలోకి ఎలా వచ్చాయన్నదానిపై స్పష్టత లేదు.