Egg Challenge For Government School Students :విద్యార్థుల్లో ఫిట్నెస్ కోసం 'ఎగ్ ఛాలెంజ్' పేరిట వినూత్న కార్యక్రమం ప్రారంభించారు ఓ స్కూల్ ప్రిన్సిపల్. ఆయనే ఝార్ఖండ్ ఉత్తర సింహభూమ్లోని టేంజేరీన్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపల్ అర్వింద్ కుమార్. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆయన గుడ్లను బహుమతిగా ఇస్తున్నారు.
"ఈ పోటీని మేము 'అండా ఛాలెంజ్'గా పిలుస్తున్నాం. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తితో పాటు రన్నింగ్ పట్ల ఆసక్తిని పెంచడానికి ఈ పోటీ నిర్వహిస్తున్నాం. విద్యార్థులంతా 3 కిలోమీటర్లు దూరం పరిగెత్తి ఛఖ్రీ పాఠశాల గోడను తాకి తిరిగి రావాలి. ఈ విధంగా ప్రతిరోజు 6 కిలోమీటర్లు రన్నింగ్ చేయాలి"
- అర్వింద్ కుమార్ తివారీ, పాఠశాల ప్రిన్సిపల్.
పిల్లలలో క్రమం తప్పకుండా రన్నింగ్ చేసే అలవాటును పెంపొందించడం, వారి పోషకాహార అవసరాలను తీర్చడమే ఈ ఛాలెంజ్ ప్రధాన లక్ష్యం. అయితే విద్యార్థులు గుడ్లను గెలుచుకోవాలంటే పోటీ సంబంధించిన పలు నియమాలను కూడా పాటించాల్సి ఉంది.
"మా పాఠశాలలో ప్రతిరోజు ఉదయం 6.30 గంటలకు పరిగెత్తుతూ చఖ్రీ స్కూల్ గోడను తాకాలి. అలా వారం రోజుల పాటు రన్నింగ్ చేస్తే వారికి ఎనిమిదో రోజు గుడ్లను ప్రిన్సిపల్ బహుమతిగా ఇస్తారు.
ప్రశ్న : ఈ విధంగా చేయడం వల్ల మీకొచ్చే లాభాలేంటి?