పీజీ వైద్య కోర్సుల ప్రవేశ పరీక్ష.. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌ను(ఎన్ఈఎక్స్టీ) 2023 ప్రథమార్ధంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ప్రక్రియను పరీక్షించడానికి, వైద్య విద్యార్థుల్లో ఆందోళనను తొలగించడానికి వచ్చే ఏడాదిలో మాక్ టెస్ట్ నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) వెల్లడించినట్లు తెలిపింది. అలాగే వైద్యవిద్యలోని పలు సమస్యలపై చర్చించినట్లు పేర్కొంది. ఎన్ఈఎక్స్టీని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించే దిశగా చర్చలు జరిగినట్లు వెల్లడించింది.
2023లో పీజీ వైద్య కోర్సులకు ప్రవేశ పరీక్ష! - మాన్సుక్ మాండవియా
2023 ప్రథమార్థంలో వైద్య విద్యార్థులకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌ను(ఎన్ఈఎక్స్టీ) నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియా నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) వెల్లడించింది.
నేషనల్ ఎగ్జిట్ టెస్ట్
పీజీ వైద్య కోర్సుల్లో ప్రేవేశానికి, సాధన(ప్రాక్టీస్) కోసం లైసెన్స్ పొందేందుకు అర్హత కోసం ఎన్ఈఎక్స్టీని నిర్వహిస్తారు. ఇది విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లకు స్క్రీనింగ్ పరీక్షగా కూడా పనిచేస్తుంది.
ఇదీ చూడండి:సీబీఎస్ఈ క్లాస్-12 ఫలితాలు విడుదల.. బాలికలే టాప్