కర్ణాటక హుబ్లీలోని 'స్మైల్ టీం'.. వీధి జంతువులపాలిట ఆపద్బాంధవుగా నిలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రోడ్డు పక్కన తలదాచుకునే శునకాలు, ఇతర జంతువులకు నీరు, ఆహారం అందించి తమ దాతృత్వాన్ని చాటుతున్నారు బృందంలోని విద్యార్థులు. తమ పాకెట్ మనీతోనే.. వీధి జంతువుల ఆలనాపాలనా చూస్తూ.. తమవంతు సామాజిక సేవ చేస్తున్నారు.
స్థానికుల అండతో..
తమ ప్రయత్నాన్ని విజయంవంతం చేసేందుకు స్థానికుల సహాయం తీసుకుంటున్నారు టీంలోని విద్యార్థులు. దీంతో వీధి జంతువులు నివాసం ఉండే ప్రాంతాల్లో నీరు, బిస్కెట్లు, ఆహారాన్ని ఉంచుతున్నారు. శునక ప్రేమికులకు ఈ విధానాన్ని వివరించి.. వారి సహకారం కోరారు విద్యార్థులు.