తెలంగాణ

telangana

By

Published : Feb 19, 2021, 4:01 PM IST

ETV Bharat / bharat

నేతాజీ జీవితం.. భవిష్యత్​ తరాలకూ ఆదర్శం: షా

నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ పోరాట పటిమ.. రానున్న తరాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నేతాజీ జీవితం గురించి దేశ యువత తెలుసుకోవాలని అమిత్​ షా సూచించారు. నేతాజీ 125వ జయంతి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

amith shah about netaji
నేతాజీ జీవితం.. భవిష్యత్​ తరాలకూ ఆదర్శవంతం: అమిత్ షా

స్వాతంత్య్ర సమర యోధుడు, నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ను..​ చరిత్ర నుంచి కనుమరుగయ్యారని నిర్ధరించే ప్రయత్నాలు జరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా అన్నారు. కానీ, ఆయన అందించిన ధైర్యం, దేశభక్తి, నిస్వార్థ సేవ సుగుణాలు ఈ దేశంలో శాశ్వతంగా ఉంటాయని పేర్కొన్నారు. అవి భవిష్యత్​ తరాలను ప్రేరణగా నిలుస్తూనే ఉంటాయని చెప్పారు. కోల్​కతాలోని నేషనల్​ లైబ్రరీలో శౌర్యాంజలి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. స్వాతంత్య్ర సమరయోధుల పోరాట పటిమను దేశ యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.

"నేతాజీని ఇప్పటికీ ఎంతో మంది ప్రేమిస్తారు. ఆయన తెగువ ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుంది. బంగాల్​ గడ్డపై ఆయన.. భారత జాతీయ ఆర్మీ(ఐఎన్​ఏ)ని స్థాపించారు. జీవితాన్ని త్యాగం చేయడం అంటే దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడమేనని నేతాజీ తన జీవితం ద్వారా బోధించారు. ఆయన లేకుంటే ఐఎన్​ఏ ఏర్పడేది కాదు."

-అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

నేతాజీ జీవితం గురించి అధ్యయనం చేయాలని యువతకు అమిత్​ షా సూచించారు. చరిత్ర తెలిసిన యువతే.. దృఢమైన జాతిని నిర్మించగలరని అన్నారు. నేతాజీ 125వ జయంతి వేడుకల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు అమిత్ ​షా తెలిపారు. దేశంలో ఓ గొప్ప మార్పునకు ఈ కమిటీ దోహదపడుతుందని అన్నారు.

ఇదీ చదవండి:'ఆ రాష్ట్రాల నుంచి కూడా మద్దతు కోరతాం'

ABOUT THE AUTHOR

...view details