Eenadu Journalism School Notification Released : అక్షరానికి సామాజిక ప్రయోజనం కలిగించే పాత్రికేయ వృత్తిలో చేరాలనుకుంటున్నారా? సమాజాభివృద్ధి పట్ల ఆకాంక్ష, భాష మీద పట్టు మీకు ఉంటే, ఈ ప్రకటన కచ్చితంగా మీ కోసమే. కొత్త తరం పాత్రికేయుల్ని తీర్చిదిద్దటం కోసం మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్ జర్నలిజం విభాగాల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నాం.
► ఎంపిక..
మొదట వివిధ అంశాల మీద రాత పరీక్షలు జరుగుతాయి. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ప్రావీణ్యాన్నీ, అనువాద సామర్థ్యాన్నీ, వర్తమాన వ్యవహారాల్లో పరిజ్ఞానాన్నీ పరీక్షించే లఘు, వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. వీటిలో ఉత్తీర్ణులైన వారికి బృంద చర్చలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. సంస్థ నియమ నిబంధనలకు లోబడి తుది ఎంపిక ఉంటుంది.
► శిక్షణ, భృతి
ఈనాడు జర్నలిజం స్కూలులో ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో మొదటి ఆరు నెలలు Rs.14,000, తరువాతి ఆరు నెలలు Rs.15,000 చొప్పున నెలవారీ భృతి లభిస్తుంది.
► ఉద్యోగంలో
స్కూల్లో కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రెయినీలుగా అవకాశం లభిస్తుంది. ఏడాది పాటు జరిగే ఈ శిక్షణలో Rs 18,000 జీతం ఉంటుంది. అది పూర్తయ్యాక, శిక్షణార్థుల వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఒక ఏడాది ప్రొబేషన్‌లో Rs 20,000 వరకూ, ఆ తరువాత కన్ఫర్మేషన్‌లో Rs 22,000 వరకూ జీత భత్యాలు ఉంటాయి.
► దరఖాస్తు విధానం
దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి. www.eenadu.net, pratibha.eenadu.net/eenadupratibha.net లలో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు రుసుము Rs.200 ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. దరఖాస్తు ధ్రువీకరణ నకలును అభ్యర్థులు తమ వద్ద తప్పని సరిగా ఉంచుకోవాలి.