ప్రభుత్వ వ్యతిరేక కథనాలను తటస్థీకరించే చర్యలను సిఫార్సు చేస్తూ మంత్రుల కూటమి (జీవోఎం) ఇటీవల సమర్పించిన నివేదికపై 'ది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా'(ఈజీఐ) తన విస్మయాన్ని, అసమ్మతిని తెలియజేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా చేసే విమర్శలు, విచారణలను అణచివేయాలన్న దమననీతిని ఈ నివేదిక తేటతెల్లం చేస్తున్నట్టు పేర్కొంది. గతేడాది మధ్యలో అయిదుగురు కేబినెట్ మంత్రులు, నలుగురు సహాయ మంత్రుల కూడికతో ఈ మంత్రుల కూటమి ఏర్పాటైంది.
'ప్రభుత్వాన్ని విమర్శిస్తే అణచివేతా!' - group of ministers on journals
ప్రభుత్వ వ్యతిరేక కథనాలను తటస్థీకరించాలంటూ కేంద్ర మంత్రుల కూటమి ఇటీవల సమర్పించిన నివేదికపై 'ది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' అసమ్మతిని తెలియజేసింది. మీడియా చేసే విమర్శలను అణచివేయాలన్న దమననీతి ఈ నివేదికలో కనిపిస్తోందని ఆక్షేపించింది.
ఏడాది చివరలో సిద్ధమైన ఈ కూటమి నివేదిక ఇటీవల బహిర్గతమైంది. ప్రభుత్వ వ్యతిరేక మార్గంలో వెళ్లే రచయితలు, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొన్నట్టు నివేదిక ఉందని సంపాదకవర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నివేదిక బయటికి వచ్చాక మంత్రుల కూటమిలో సభ్యులుగా పేర్కొన్న కొంతమంది తమకేమాత్రం సంబంధం లేదంటూ ప్రకటించడం గమనార్హం. రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావడేకర్, స్మృతి ఇరానీ, ఎస్.జైశంకర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, హర్‌దీప్‌సింగ్ పురి, బాబుల్ సుప్రియో, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు సభ్యులుగా ఉన్న మంత్రుల కూటమి ఆరుసార్లు సమావేశమై నివేదిక సమర్పించింది.
ఇదీ చదవండి :అంబానీ ఇంటి వద్ద బాంబులు- ఆ అధికారి పాత్ర ఉందా?