తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శివసేన ఎమ్మెల్యే బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు - mla pratap sarnaik money laundering

మనీలాండరింగ్​ కేసులో శివసేన ఎమ్మెల్యే ప్రతాప్​ సర్నాయక్​తో సంబంధం ఉన్న వారి నివాసాల్లో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ​ మహారాష్ట్రలోని సమారు 10 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ED raids premises linked to Shiv Sena MLA in money-laundering case
శివసేన ఎమ్మెల్యే బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు

By

Published : Nov 24, 2020, 12:24 PM IST

కేంద్ర బలగాల మధ్యన శివసేన ఎమ్మెల్యే ప్రతాప్​ సర్నాయక్​తో సంబంధం ఉన్న పలువురి ఇళ్లలో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేస్తోంది. అతనిపై మనీలాండరింగ్​ ఆరోపణలు ఉండడం కారణంగా సోదాలు చేపట్టినట్లు ఆధికారులు తెలిపారు.

శివసేన ఎమ్మెల్యే బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు
కేంద్ర బలగాలు
ఈడీ సోదాలు

మహారాష్ట్రలోని ఠానే, ముంబయి పట్టణాల్లో పది ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు వెల్లడించారు.

ఈడీ మనీలాండరింగ్​కు సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టాం. వీరిలో ప్రతాప్​ సర్నాయక్​తో సంబంధం ఉన్న వారిని విచారిస్తున్నాం. అందులో కంపెనీ ప్రొమోటర్స్​తో పాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు.

-ఈడీ అధికారులు

ఇదీ చూడండి: 'మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details