ED Raids in Mumbai: అండర్వరల్డ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈడీ నడుం బిగించింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా.. సంబంధిత కార్యకలాపాలు, లావాదేవీలతో సంబంధం ఉన్న పలువురి ఇళ్లపై మంగళవారం దాడులు నిర్వహిస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ముంబయిలోని సుమారు 10 చోట్లకుపైగా ఈడీ విస్తృత సోదాలు జరిపింది.
ఓ రాజకీయ నాయకుడి ఇళ్లు, కార్యాలయాల్లో కూడా ఈడీ తనిఖీలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి.. హసీనా పార్కర్ ఇంటికీ వెళ్లినట్లు తెలిపాయి.