తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వివో కంపెనీ'పై ఈడీ దాడులు.. 44ప్రాంతాల్లో సోదాలు - ఈడీ రైడ్లు

ED raids Vivo: మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా వివో సహా పలు చైనా కంపెనీలపై ఈడీ దాడులు చేపట్టింది. దేశంలోని 44 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ED raids against Vivo
ED raids against Vivo

By

Published : Jul 5, 2022, 12:22 PM IST

ED raids on Vivo company: వివో మొబైల్‌ కంపెనీ సహా పలు చైనీస్‌ సంస్థలపై ఈడీ దాడులు చేపట్టింది. దేశవ్యాప్తంగా దాదాపు 44 చోట్ల ఈడీ దాడులు జరుపుతున్నట్లు అధికార వర్గాలు తెలిపింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈ దాడులు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బిహార్‌, ఝార్ఖండ్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

ఇదివరకు నమోదైన కేసులతో పాటు మరో కొత్త కేసును ఈడీ నమోదు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తాజా దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వివో సహా అనుబంధ సంస్థలపై సోదాలు చేస్తున్నట్లు అధికరాలు తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details